డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం: రూ. 29 లక్షలు కాజేసిన ముఠాలో ఇద్దరి అరెస్ట్
Advertisement
- డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి మోసం
- సీబీఐ, ఈడీ అధికారులమంటూ బెదిరింపులు
- విడతలవారీగా రూ. 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- మోసానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
- పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు
Advertisement
హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరిగిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 63 ఏళ్ల ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ. 29 లక్షలకు పైగా కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికే చెందిన మహమ్మద్ అష్ఫాక్ హుస్సేన్, అహ్మద్ నజీబ్ ఉద్దీన్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బెంగళూరుకు చెందిన సచిన్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఈ ఏడాది మార్చి 3న బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, తాము ఢిల్లీ పోలీసులు, సీబీఐ, ఈడీ అధికారులమని నమ్మబలికారు. రూ. 68 మిలియన్ల మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ప్రమేయం ఉందని, ఆధార్ వివరాలుడ, వేలిముద్రలు దుర్వినియోగం అయ్యాయని బెదిరించారు. అరెస్ట్ చేస్తామంటూ నకిలీ పత్రాలను పంపి, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారమని, ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు, ఆయన కుమార్తె విడతల వారీగా మొత్తం రూ. 29,17,668లను నిందితుల ఖాతాలకు బదిలీ చేశారు.
నిందితులు తమ మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఈ మోసానికి ఉపయోగించారని, బాధితుడి నుంచి వచ్చిన సొమ్మును విత్‌డ్రా చేసి, ఎవరికీ అనుమానం రాకుండా క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా వివిధ ఖాతాల్లో జమ చేశారని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & సిట్) ఎం. శ్రీనివాసులు తెలిపారు. అనంతరం ఆ మొత్తాన్ని యూఎస్డీటీ (క్రిప్టో కరెన్సీ) రూపంలోకి మార్చి, నిందితులు తమ కమీషన్ తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాట్సాప్ ద్వారా సచిన్‌తో చేతులు కలిపి ఈ నేరానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.